భార‌త 17వ ఉప రాష్ట్రప‌తిగా సిపి రాధాకృష్ణ‌న్

ఢిల్లీ (CLiC2NEWS): భార‌త 17 వ ఉప రాష్ట్రప‌తి ఎన్నిక మంగ‌ళ‌వారం జ‌రిగింది. ఈ ఎన్నిక‌లో ఎన్‌డిఎ కూట‌మి అభ్య‌ర్థి సిపి రాధా కృష్ణ‌న్ విజ‌యం సాధించారు. 1957 అక్టోబ‌ర్ 20న త‌మిళ‌నాడులోని తిరుప్పుర్‌లో  రాధాకృష్ణ‌న్ జ‌న్మించారు. కాలేజి రోజుల్లో ఆయ‌న టేబుల్ టెన్నిస్ ఛాంపియ‌న్‌. రాధాకృష్ణ‌న్ 1998లో బిజెపి నుండి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తొలిసారి పోటి చేసి 1.5 ల‌క్ష‌ల మెజారిటీతో గెలుపొందారు. తిరిగి 1999 లో జ‌రిగిన (రాజ‌కీయ మార్పుల కార‌ణంగా) ఎన్నిక‌ల్లో 55వేల మెజార్టీతో గెలిచారు. ఐక్య‌రాజ్య స‌మితి 58 సెష‌న్‌లో పాల్గొన్న పార్ల‌మెంట‌రీ బృందంలో రాధాకృష్ణ‌న్ స‌భ్యుడు. 2003 అక్టోబ‌ర్లో ఐరాస జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో ప్ర‌సంగించారు. భార‌తీయ జ‌న‌తా పార్టి త‌మిళ‌నాడు రాష్ట్ర అధ్య‌క్షుడిగా 2004, 2007లో బాధ్య‌త‌లు నిర్వ‌హించారు.

 

ఉప రాష్ట్రప‌తిగా సిపి రాధాకృష్ణ‌న్ విజ‌యం

Leave A Reply

Your email address will not be published.