పండక్కి ఊరెళ్లే వారికి సిపి స్టీఫెన్ రవీంద్ర సూచనలు..
హైదరాబాద్ (CLiC2NEWS): సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి పలు సూచనలను సూచించారు. ఇంటి పరిసాలలలో కొత్త వారి కదలికలపై పోలీసులకు సమాచారం అందించాలి. కాలనీలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. బైక్‌లను, కార్లను ఇళ్ల ఆవరణలోనే పార్కింగ్ చేసుకోవాలన్నారు. విలువైన వస్తువులు బైక్‌లు, కార్లలో పెట్టొద్దని తెలిపారు. ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి. పేపరు పాలవాడిని రావొద్దని చెప్పాలి. టైమర్‌తో కూడిన లైట్లను అమర్చుకోవాలి. ఇంటి డోర్‌కు సెంట్రల్ లాక్ సిస్టమ్ ఏర్పటు చేసుకోవాలని సూచించారు. ప్రజలు,పోలీసుల మధ్య సమన్వయంతోనే చోరీలను నియంత్రించవచ్చని సిపి అన్నారు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్, బీట్ కానిస్టేబుల్ నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలి. బంగారు నగాలు, నగదు, బ్యాంకు లాకర్లలో పెట్టుకోవాలని తెలిపారు.