మూడు పెళ్లిళ్లు ప్ర‌మాద‌మా? హ‌త్య‌లు ప్ర‌మాద‌మా?: సిపిఐ నారాయ‌ణ‌

విజ‌య‌వాడ (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్.. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేస్తున్నార‌ని సిపిఐ నేత నారాయ‌ణ అన్నారు. విజ‌య‌వాడలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప‌వ‌న్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే ఎందుక‌ని.. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేస్తున్నార‌ని.. ఆయ‌న ఎంత మందిని పెళ్లి చేసుకున్నా విడాకులు తీసుకుని చేసుకున్నార‌న్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకోవ‌డం ప్ర‌మాద‌మా.. హ‌త్య‌లు చేయ‌డం ప్ర‌మాద‌మా.. అని నారాయ‌ణ అని ప్ర‌శ్నిస్తున్నారు. వ్య‌క్తి గ‌త దూష‌ణ‌లు ఎందుకొస్తాయి .. రాజ‌కీయాల్లో ప‌స ఉంటే రావు క‌దా.. ప‌స‌లేక‌పోతే వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లొస్తాయ‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.