AP: జాతరకు వెళ్లొస్తుండగా ఐదుగురు దుర్మరణం

బాపట్ల (CLiC2NEWS): ఎపిలోని బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేదరమెట్ల బైపాస్ జాతీయ రహదారిపై ఒంగోలువైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు టైరు ఫంక్చరయి అదుపు తప్పి డివైడర్ దాటి అవతలి వైపునకు ఎగిరి పడింది. అదే టైంలో ఒంగోలు వైపు వెళ్తున్న లారీ కారును ఢీ కొట్టింది. దీంతో ప్రమాదంలో ఉన్న అయిదు గురు ఘటనాస్థలంలో మరణించారు. ఈ ప్రమాదంలో అద్దంకి ఎస్సై సుమందరపలి భార్య వహీదా (35), కుమార్తె అయేషా (9), స్నేహితులు బుర్రాల జయశ్రీ (50), జుర్రాల దివ్యతేజ (29), డ్రైవర్ బ్రహ్మచారి (22) ఉన్నట్లు గుర్తించారు.
ఘటనాస్థలికి చేరుకున్న అద్దంకి సిఐ రోశయ్య ప్రమాద తీరును పరిశీలించారు. మృతులంతా చినగంజాం తిరునాళ్లకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సిఐ తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నరు.