సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య!
హైదరాబాద్ (CLiC2NEWS): సికిందరాబాద్ బేగంపేటలో సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ దేవేందర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం తెల్లవారు జామున స్థానిక చికోటి గార్డెన్ వద్ద సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఛత్తీసగఢ్‌కు చెందిన దేవేందర్‌గా గుర్తించారు. కాగా ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని బేగంపేట పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.