క్యుములోనింబ‌స్: తెలంగాణ‌లో రెండు రోజులు వ‌ర్షాలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ‌, రేపు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. క్యుములోనింబ‌స్ మేఘాల ప్ర‌భావంతో రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయి. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, హ‌నుమ‌కొండ , వ‌రంగ‌ల్, మ‌హ‌బూబాబాద్‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, సూర్యాపేట , న‌ల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల‌తో కూడిన తేలిక‌పాటి నుండి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ జిల్లాల్లో గంట‌కు 40 నుండి 50 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉంది. ఈ జిల్లాల‌కు ఇప్ప‌టికే ఆరెంజ్ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.