విశాఖ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న విషపూరిత బల్లులు

విశాఖ (CLiC2NEWS): భారత్‌కు అక్రమంగా తీసుకొచ్చిన విదేశీ బల్లులను విశాఖ విమానాశ్రమంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. థాయ్‌లాండ్ నుండి అక్రమంగా భారత్‌కు తరలిస్తున్న నీలిరంగు నాలుక కలిగినవి 3, వెస్ట్రన్ బల్లులు 3 స్వాధీనం చేసుకున్నారు.కేక్ ప్యాక్‌లో పెట్టి బల్లులను తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిఆర్ ఐ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో వీటిని గుర్తించారు. వాటిని తిరిగి థాయ్‌లాండ్‌కు పంపించినట్లు సమాచారం.