అంధకారంలో గాజా: గాజాకు విద్యుత్ సరఫరాను నిలిపివేత !

జెరూసలెం (CLiC2NEWS): ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం ప్రతి దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఐదవ రోజు దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హమాస్ మిలిటెంట్లకు కేంద్రంగా నిలిచిన గాజాకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఇంకా గాజా సరిహద్దులన్నీ మూసివేసింది. విద్యుత్ కేంద్రానికి, ఇళ్లు, కార్యాలయాల్లో వాడే జనరేటర్లకు ఇంధనం తీసుకురావడం కష్టంగా మారింది. విద్యుత్ తయారీ కేంద్రంకూడా మూతపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో 22 లక్షల జనాభా కలిగిన గాజా మొత్తం అంధకారంలో మగ్గుతుంది. హమాస్ ఉగ్రవాదుల స్థావరాలకు విద్యుత్తు నిలిపివేస్తామని ఇజ్రాయెల్ ఇటీవలే ప్రకటించింది.
ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ల ఘర్షణల్లో ఇప్పటివరకు దాదాపు 3,500 మంది మరణించినట్లు సమాచారం. వీరిలో 1,200 మంది ఇజ్రాయెల్‌కు చెందివారుండగా.. 1500 మంది హమాస్ మిలిటెంట్లు ఉన్నారు. మరో 765 మంది పాలస్తీనా వాసులు కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.