మనీలాండరింగ్ కేసునుండి తప్పించాలంటే రూ. 60 లక్షలు చెల్లించండి!
సైబర్ నేరగాళ్ల నయా పంథా..
హైదరాబాద్ (CLiC2NEWS): సైబర్ నేరగాళ్లు చేసే మోసాలు రోజురోజుకీ పెరిగుపోతున్నాయి. ఏదో ఒక రీతిలో ప్రజల నుండి సొమ్మును కాజేస్తున్నారు. తాజాగా కొత్త తరహాలో ఏకంగా రూ. 60 లక్షల నగదును కాజేశారు. నగరానికి చెందిన ఓ యువతి కి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి.. మనీ లాండరింగ్ కేసులో మీ పేరుంది, స్కైప్ ద్వారా వీడియో కాల్‌లో మాట్లాడారు. కేసు నుండి తప్పించుకోవాలంటే తాము చెప్పిన ఖాతాకు రూ. 60 లక్షలు నగదు బరిలీ చేయాలని చెప్పారు. వాళ్లు చెప్పినట్లే చేసిన ఆయువతి.. మోసపోయినట్లు గ్రహించి 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన సైబర్ సెక్యూరిటి బ్యూరో అధికారులు నగదును ఫ్రీజ్ చేశారు.