కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
న్యూఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర మంత్రివర్గం గుడ్‌న్యూస్ చెప్పింది. గత ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డిఎ) పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. ఏడో వేతన సవరణ సంఘం సిఫారసుల మేరకు డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పెంచిన డీఏ 2021, జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
The Dearness Allowance (DA) for Central Government employees and pensioners has been increased from 17% to 28%. This will be applicable from 1st July 2021: Union Minister Anurag Thakur pic.twitter.com/SCy3AS2hoN
— ANI (@ANI) July 14, 2021