AP: పెన్షనర్లకు 3.144 % మేర DA పెంపు
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని పెన్షనర్లకు సర్కార్ 3.144 % డీఏ పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.144 శాతం కరువు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపజేస్తూ నిర్ణయించారు. అలాగే కొత్త పెంపుతో పెన్షనర్ల కరువు భత్యం 33.536 శాతానికి పెరిగింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేసిన పెన్షనర్లకు సవరించిన కరవు భత్యం రేట్లను సవరిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.