డ్యాన్స్ చేసిన ఎంపీ ప్ర‌జ్ఞా ఠాకూర్‌

భోపాల్ (CLiC2NEWS): ఓ పెళ్లి వేడుక‌లో భార‌తీయ జ‌న‌తాపార్టీ ఎంపి ప్ర‌జ్ఞా ఠాకూర్ డ్యాన్స్ చేశారు. ఎంపి వేసిన డాన్సు వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఆ ఎంపీ .. బాస్కెట్‌బాల్ ఆడుతూ కూడా క‌నిపించిన విష‌యం తెలిసిందే.

భోపాల్‌లో ఈమ‌ధ్యే ఇద్ద‌రి అమ్మాయిల పెళ్లి చేసింది ప్ర‌జ్ఞా. అప్ప‌గింత‌ల వేళ డీజే మ్యూజిక్ స‌మ‌యంలో ఆమె స్టెప్పులేశారు. అంతేకాదు.. ఆహ్వానితుల‌ను కూడా డ్యాన్స్ చేసేందుకు ప్రోత్స‌హించారు. స‌ర‌దాగా ప్ర‌జ్ఞా డ్యాన్స్ చేస్తున్న వీడియో వైర‌ల్ కావ‌డంతో.. ఇక కాంగ్రెస్ ఎంపీ న‌రేంద్ర స‌లూజా సెటైర్ వేశారు. ఆయన త‌న ట్విట్ట‌ర్‌లో ఆ వీడియోను పోస్టు చేస్తూ.. ఎంపీ ప్ర‌జ్ఞా ఎప్పుడూ ఇలాగే హుషారుగా ఉండాల‌న్నారు. ఠాకూర్‌ను ఇలా చూడ‌డం సంతోషం వేస్తోంద‌న్నారు.

కాగా మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్ర‌జ్ఞా విచార‌ణ ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. కాగా ఆరోగ్య కార‌ణాల చేత విచార‌ణ‌కు హాజ‌రుకావ‌డం లేదు ఈ ఎంపి. వీల్‌చైర్‌లో ఉన్న ఆమె .. విచార‌ణ నుంచి మిన‌హాయింపును కోరారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ్ఞా బాస్కెట్‌బాల్ ఆడుతూ.. డ్యాన్స్ చేస్తూ క‌నిపించ‌డంపై కాంగ్రెస్ ఎంపీ సెటైర్ వేశారు అని ప‌లువ‌రు అనుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.