కోల్‌కతా: యుకొ బ్యాంకులో డేటా అనలిస్టులు
UCO BANK: కోల్‌కతాలోని యునైటెడ్ కమర్షియల్ (UCO) బ్యాంకు మానవ వనరుల విభాగం ఒప్పంద ప్రాతికదికన 12 ఖాళీల భర్తీకి దరఖాస్తులును ఆహ్వానిస్తోంది. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ,,ధ్రువ పత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.
చీఫ్ రిస్క్ ఆఫీసర్ -1
డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ -1
చీఫ్ మేనేజర్ -డేటా అనలిస్ట్ -1
మేనేజర్ -డేటా అనలిస్ట్ -4
సీనియర్ మేనేజర్- క్లైమేట్ రిస్క్ -1
మేనేజర్ ఎకనామిస్ట్ -2
ఆపరేషనల్ రిస్క్ అడ్వైజర్ -1
డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ 1
పైన పేర్కొన్న పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సిఎ, డిగ్రీ, బిఇ/ బిటెక్, ఎంఇ/ ఎంటెక్, ఎంబిఎతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 65 ఏళ్లకుమించకూడదు. దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ లోపు పంపించాలి. దరఖాస్తు రుసుం రూ. 600గా నిర్ణయించారు. ఎస్‌సి/ ఎస్‌టి/ పిడబ్ల్యుబిడిలకు రూ.100. పూర్తి వివరాలకు ఆసక్తి గల అభ్యర్థులు https://ucobank.com/ వెబ్‌సైట్ చూడగలరు.