కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ మార్పు

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని కానిస్టేబుల్ రాతపరీక్ష తేదీ మార్పు చేసినట్టు తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు పేర్కొంది. ఆగస్టు 21వ తేదీన కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎక్జామ్ జరగవలసి ఉండగా.. సాంకేతిక కారణాల దృష్ట్యా పరీక్ష తేదీని ఈ నెల 28వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 15,644 కానిస్టేబుల్, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 6.50 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలకు 40 పట్టణాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.