స‌న‌త్‌న‌గ‌ర్‌లో బాలుడి దారుణ హ‌త్య‌..!

హైద‌రాబాద్ (CLiC2NEWS): స‌న‌త్‌న‌గ‌ర్‌లో ఓ బాలుడిని హ‌త్య‌చేసిన దుండ‌గులు.. బ‌కెట్‌లో కుక్కి నాలాలో ప‌డ‌వేశారు. ఆర్ధిక లావాల‌దేవీల వ్వ‌వ‌హారంలో బాలుడిని దారుణంగా హ‌త్య‌చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కోటిలో వ‌స్త్ర దుకాణ దారుడు చిట్టీల వ్యాపారం చేసే ఫిజాఖాన్ వ‌ద్ద చిట్టీ వేశాడు. దీనికి సంబంధించిన డ‌బ్బు ఫిజాఖాన్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ కొన‌సాగుతోంది. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రుగుతున్న గొడ‌వ గురువారం ఎక్క‌వైంది. దీంతో వ‌సీంఖాన్ కుమార‌డుని కొంద‌రు వ్య‌క్తులు అప‌హ‌రించి ప్లాస్టిక్ సంచిలో తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. బాలుడు క‌నిపించ‌టం లేద‌ని వ‌సీంఖాన్ రాత్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు ద‌ర్యాప్తు చేస్టిన పోలీసులు సిసిటివి పుటేజిల ఆధారంతో నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. జింక‌ల‌వాడ సమీపంలోని నాలాలో బాలుడి మృత‌దేహంను వెలికితీశారు. పోలీసులు ఐదుగురు నిందితుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బాధిత కుటుంబ స‌భ్యుల‌ను మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. ఏదేనా గొడ‌వ‌లుంటే పెద్ద‌లు చేసుకోవాలి, కానీ.. ఆ బాలుడిని హ‌త్యచేయ‌డం దార‌ణ‌మ‌న్నారు. నిందితుల‌కు ఉరిశిక్ష ప‌డాల‌న్నారు. ఈ ఘ‌ట‌న‌తో త‌ల్లిదండ్రులు, బ‌స్తీవాసులు భ‌య‌బ్రాంతుల‌కు లోన‌య్యారు. వారి భ‌యాన్ని పోగొట్టేందుకు పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేస్తామ‌ని..బాధిత కుంటుంబాన్ని ఆదుకుంటామ‌ని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.