ఉక్రెయిన్ నుండి బెంగ‌ళూరుకు చేరిన భార‌త విద్యార్థి భౌతిక‌కాయం

బెంగ‌ళూరు (CLiC2NEWS): ఉక్రెయిన్‌లోని ర‌ష్యా జ‌రిపిన దాడివ‌ల‌న‌ మ‌ర‌ణించిన భార‌త విద్యార్థి న‌వీన్ శేఖ‌ర‌ప్ప భౌతిక‌కాయం ప్ర‌త్యేక విమానంలో బెంగ‌ళూరుకు చేరుకుంది. ఉక్రెయిన్‌లో మెడిసిన్ చ‌దువుతున్న విద్యార్థి న‌వీన్.. ఖ‌ర్కివ్‌లో జ‌రిగిన పేలుళ్ల‌లో ప్రాణాలు కోల్పోయాడు. బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టులో అత‌ని పార్ధివ దేహానికి సిఎం బ‌స‌వ‌రాజు బొమ్మై నివాళులు అర్పించారు. భౌతికకాయాన్ని స్వ‌దేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన కేంద్ర ప్ర‌భుత్వానికి సిఎం ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.