లోక్‌స‌భ‌లో డిసెంబ‌ర్ 13 ఘ‌ట‌న‌.. వెలుగులోకి కీల‌క విష‌యాలు

బెంగ‌ళూరు (CLiC2NEWS): పార్ల‌మెంట్ సమావేశాల స‌మ‌యంలో ఇద్ద‌రు వ్య‌క్తులు లోక్‌స‌భ‌లోకి దూసుకొచ్చి.. గంద‌ర‌గోళం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న ఆరుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు ముమ్మ‌రంగా సాగుతుంది. ఆరుగురు దుండ‌గులు ఒక్కోరాష్ట్రానికి చెందిన‌వార‌ని స‌మాచారం. వీరిలో ఒక‌రైన‌ మ‌నోరంజ‌న్‌.. పోలీసు శాఖ‌లోని ఓ మాజీ ఉన్న‌తాధికారుడి కుమారిడు సాయికృష్ణ‌కి స్నేహితుడుగా గుర్తించారు. వీరిద్ద‌రూ క‌లిసి ఇంజినీరంగ్ క‌ళాశాల‌లో బ్యాచ్‌మెట్స్ అని నిర్ధారించారు. విచార‌ణ‌లో భాగంగా మ‌నోరంజ‌న్ వివ‌రాల ప్రకారం సాయికృష్ణ‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ నెల 13వ తేదీన లోక్‌స‌భ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో మ‌నోరంజ‌న్‌, సాగ‌ర్ శ‌ర్మ‌.. విజిట‌ర్స్ బ్లాక్ నుండి కిందికి దూకి గంద‌ర‌గోళం సృష్టించారు. పార్ల‌మెంట్ వెలుప‌ల మ‌రో ఇద్ద‌రు అమోల్ శిండే, నీల‌మ్ ఆజాద్ ఆందోళ‌న చేప‌ట్టారు. దీనంత‌టికి కార‌ణ‌మైన మ‌రో నిందితుడు ల‌లిత్ ఝూ, అత‌నికి స‌హ‌క‌రించిన మ‌హేశ్ కుమావ‌త్‌ను సైతం పోలీసులు విచారిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.