ఉదారత చాటుకున్న టిఎస్ఆర్టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
కృతజ్ఞతలు తెలిపిన TSRTC ఎండి సజ్జనార్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రుష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తాను జీతభత్యాలను తీసుకోనని నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ్యునిగా తనకు వస్తున్న జీతభత్యాలు చాలని ఒక లేఖలో వ్రాసి టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జనార్‌కు ఇచ్చారు. ఆర్టీసీ ప్రస్తుతం నష్టాల్లో ఉన్నందున ఆర్ధిక భారం మోపడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఛైర్మన్ బాజిరెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఎండి సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చరిత్రాత్మక నిర్ణయం పట్ల సంస్థ ఇతర అధికారులు, సూపర్వైజర్లు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.