జీవిత‌, ఆరోగ్య బీమాపై జిఎస్‌టి త‌గ్గింపుపై నిర్ణ‌యం వాయిదా..

ఢిల్లీ (CLiC2NEWS): జీవిత‌, ఆరోగ్య బీమాపై ఉన్న 18% జిఎస్‌టిని త‌గ్గించేందుకు మండ‌లిలో ఏకాభిప్రాయం కుదిరింది. అయిన‌ప్ప‌టికీ దీనిపై తుది నిర్ణ‌యం వెలువ‌డ‌లేదు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలో జ‌రిగిన 54వ జిఎస్‌టి కౌన్సిల్ స‌మావేశంలో దీనిపై విస్తృత చ‌ర్చ జ‌రిగింది. జిఎస్‌టి త‌గ్గింపుపై జిఎస్‌టి కౌన్సిల్‌లో నిర్ణ‌యం వాయిదా ప‌డింది. త‌దుప‌రి భేటీలో దీనిపై నిర్ణ‌యం వెలువ‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. అదేవిధంగా ఆధ్యాత్మిక ప్ర‌దేశాల్లొ హెలికాప్ట‌ర్ సేవ‌ల‌పై జిఎస్‌టిని 18% నుండి 5% కి తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.