ప్రభుత్వ కార్యాలయాల్లో ఖర్చు తగ్గింపుపై దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కార్
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహణ ఖర్చుల విషయంలో తెలంగాణ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో అనవసర ఖర్చు తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం. తప్పనిసరి అధికారిక కార్యక్రమాలు మినహా విదేశీ పర్యటనలను వీలైనంత వరకు నియంత్రించాలని సూచించారు. కార్యాలయ నిర్వహణలో గరిష్ట వ్యయ పరిమితి దాటొద్దని, విద్యుత్ పొదుపు పాటించాలన్నారు. అదేవిధంగా కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఆర్ధిక క్రమశిక్షణ, పొదుపు పాటించాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు అదనపు నిధులు కేటాయించేందుకు వీలుగా ఖర్చుల విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సియస్ శాంతికుమారి శాఖల ముఖ్య కార్యదర్శకులకు ఆదేశాలు జారీ చేశారు.