GoodNews: త‌గ్గిన బంగారం ధరలు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌… నేడు పసిడి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. బంగారం ధరల్లో ఒక రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడుతుంది. తాజాగా ఇవాళ (ఆదివారం) మాత్రం దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వంద రూపాయలు పతనమైంది. గత నాలుగు రోజుల నుంచి వరుసగా తగ్గుతూ వస్తోంది బంగారం. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 44,000లకు దిగి వచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే రూ. 110 పతనమైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 110 తగ్గి రూ.48,000 లకు చేరుకుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రం హెచ్చుతగ్గులు ఉన్నాయి. మొత్తం మీద ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా త‌గ్గింది. దేశంలోని ప‌లు నగరాల్లో ఇవాళ ఉదయం 6 గంటల వ‌ర‌కు ధరల వివరాలు ..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.44,000
    24 క్యారెట్ల 10 గ్రాములు రూ.48,000 ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.44,000
    24 క్యారెట్ల 10 గ్రాములు రూ.48,000 ఉంది.
  • విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.44,100
    24 క్యారెట్ల 10 గ్రాములు ధ‌ర‌ రూ.48,110 ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.46,150
    24 క్యారెట్ల 10 గ్రాములు రూ.50,350
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.44,400
    24 క్యారెట్ల 10 గ్రాములు రూ.48,440 ఉంది.
  • ముంబ‌యిలో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.46,070
    24 క్యారెట్ల 10 గ్రాములు రూ.47,070 ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.46,450
    24 క్యారెట్ల 10 గ్రాములు రూ.49,150 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.44,000
    24 క్యారెట్ల 10 గ్రాములు రూ.48,000 ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.44,000
    24 క్యారెట్ల 10 గ్రాములు రూ.48,000 ఉంది.
Leave A Reply

Your email address will not be published.