సామాన్య ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తే తప్పేంటి..?: కేజ్రీవాల్

ఢిల్లీ (CLiC2NEWS): మంత్రులకు ఉచిత విద్యుత్ ఇస్తుండగా.. సామాన్యులకు ఉచిత విద్య, వైద్యం అందిస్తే తప్పేంటని ఆమ్ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో.. కేజ్రీవాల్ ఉచిత విద్య, వైద్యం అందిస్తామంటూ ప్రకటన చేశారు. దీనిపై బిజెపి నేతల నుండి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కేవలం మంత్రులు మాత్రమే ఉచిత విద్యుత్ పొందాలా.. సామాన్యులకు ఇవ్వారా.. ఉచితంగా నీరు, ఉచిత విద్య ఇస్తే తప్పేంటి.. అని ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విద్య, వైద్యం, ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు నిరుద్యోగుల భృతి అందించాలన్నారు.