72 అడుగుల దీన్‌ద‌యాళ్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన ప్ర‌ధాని

ఢిల్లీ (CLiC2NEWS):  దేశ రాజ‌ధాని ఢిల్లీలో 72 అడుగుల పండిత్ దీన్ ద‌యాళ్‌ విగ్ర‌హాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆవిష్క‌రించారు. భార‌తీయ జ‌న‌సంఘ్ స‌హ వ్య‌వ‌స్థాప‌కులు పండిత్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ జయంతి సంద‌ర్భంగా సోమ‌వారం ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ కార్యాల‌యం ఎదురుగా ఉన్న పార్కులో విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. పేద‌లు, అట్ట‌డుగు వ‌ర్గాల వారి కోసం సేవ చేయాల‌నే సందేశం ప్ర‌తి ఒక్క‌రికీ మార్గ‌ద‌ర్శ‌నీయ‌మ‌ని ప్ర‌ధాని అన్నారు. ఆయ‌న జ‌యంతి సంద‌ర్బంగా ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.

ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాని మాట్లాడుతూ..
రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల‌కు స‌ముచిత‌మైన భాగ‌స్వామ్యం లేకుండా స‌మ్మిళి స‌మాజం, ప్ర‌జాస్వామిక స‌మైక్య‌త గురించి మాట్లాడ‌లేమ‌న్నారు. పెద్ద పెద్ద ల‌క్ష్యాల‌ను పెట్టుకొని, వాటికోసం కృషి చేసేట‌పుడు, ప్ర‌తి ఒక్కిరితో క‌లిసి ముందు కెళితే మ‌న విజ‌యాల స్థాయి కూడా పెరుగుతుంద‌ని ప్ర‌ధాని అన్నారు. ఈరోజు భార‌త్ త‌న కృషితో ఇమేజ్‌ను మార్చుకోవ‌డంతో ఇత‌రుల‌తో సాధార‌ణ భార‌తీయుడిని సైతం గౌర‌వంగా చూస్తున్నార‌న్నారు. విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జెపి న‌డ్డా త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.