ఢిల్లీ కాలుష్యం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదస్థాయికి చేరింది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో రేపటినుండి పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా కార్యాలయాల ఉద్యోగులు కూడా ఇంటినుం పని విధానాన్ని ప్రకటించింది. ప్రైవేటు కార్యాలయాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే మంచిదని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు. శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ నాలుగో దశ కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించారు.