బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్లు… చీఫ్ జస్టిస్ రాజీనామా చేయాలని డిమాండ్

ఢాకా (CLiC2NEWS): బంగ్లాదేశ్‌లో అల్లర్లు మళ్లీ చెలరేగాయి. షేక్ హసీనా రాజీనామా చేసినప్పటికీ దేశంలో అల్లర్లు ఆగలేదు. నేడు మరోసారి నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఈసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా న్యాయమూర్తులు దిగిపోవాలంటూ కోర్టు వద్ద నిరసనలు చేపట్టారు. విద్యార్థులతో పాటు పలువురు నిరసనకారులు న్యాయస్థానం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. చీఫ్ జస్టిస్ గంటలో దిగిపోవాలని డిమాండ్ చేశారు.
బంగ్లాలో రిజర్వేషన్లపై చెలరేగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో దేశ ప్రధాని రాజీనామా చేసి దేశం వీడారు. అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ సర్కార్‌కు యూనస్‌ను సారథిగా నియమితులయ్యారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి , ఇతర న్యాయమూర్తులతో సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి తాత్రాలిక ప్రభుత్వం అనుమతి లేదని, అదేవిధంగా ఆయన దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలతో నిరసనలు చెలరేగాయి. ఆందోళనకారులు చేసిన డిమాండ్‌కు జస్టిస్ అంగీకరించినట్లు సమాచారం.
మరోవైపు బంగ్లాదేశ్ కేంద్ర బ్యాంక్ గవర్నర్ అబ్దుర్ రవూఫ్ తాలుక్ దెర్ కూడా శుక్రవారం రాజీనామా చేశారు. ఆందోళనకారులు ఇటీవల ఈ బ్యాంక్ కార్యాలయంపై దాడులునిర్వహించారు. ఆయన రెండేళ్ల పదవీకాలం ఉండగానే పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.