Kamareddy: ఇంగ్లీష్ టీచర్ కర పుస్తకం ఆవిష్కరించిన డిఇఒ
కామారెడ్డి (CLiC2NEWS): ఆంగ్ల ఉపాధ్యాయుల కొరకు ELTA (ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్) వారి ఆధ్వర్యంలో తయారుచేయబడిన పదవతరగతి ఆంగ్ల పుస్తక కరదీపికను (హ్యాండ్ బుక్) శనివారం ఉపాధ్యాయులతో కలిసి కామారెడ్డి జిల్లా విద్యాధికారి (డిఇఒ) రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా డిఇఒ రాజు మాట్లాడుతూ ఈ ఉపాధ్యాయ కరపుస్తకం ఆంగ్ల భాష ఉపాధ్యాయులకు చాలా ఉపయోగకరంగా ఉందని, విద్యార్థుల్లో ఆంగ్లం పట్ల భయాన్ని తొలగించడానికి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందిచందానికి ఈ పుస్తకం దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్టా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనిల్ కుమార్, శ్రీనివాస్ యాదవ్, డీఎస్ఓ సిద్దరామారెడ్డి, డీసీఈబీ సెక్రటరీ నీలం లింగం, ఎల్టా కోశాధికారి విష్ణు వర్ధన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.