T-20 World Cup-2026 టీమిండియా జట్టు ప్రకటన
ఇషాన్ కిషన్‌కు ఛాన్స్.. గిల్ కు షాక్..
ముంబయి (CLiC2NEWS): టి -20 వరల్డ్ కప్ 2026 కి సంబంధించి టీమిండియా జట్టు ను బిసిసిఐ ప్రకటించింది. టీమిండియాకు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు. కాగా సెలక్టర్లు జట్టులో పలు మార్పు చేశారు. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ ను అనూహ్యంగా జట్టులో స్థానం కల్పించారు. మరోవైపు యశస్వి జైస్వాల్ కు వరల్డ్ కప్ జట్టులో చోటు గల్లంతైంది.
2026 టి-20 వరల్డ్ కప్ ఈసారి భారత్, శ్రీలంక వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లు 2026 ఫిబ్రవరి 7 నుంచి మొదలు కానున్నాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 8న జరగనుంది.
ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్‌లు ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో తలపడనున్నాయి.
జట్టు వివరాలు:
అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్) , రింకూ సింగ్, బుమ్రా, అర్షదీప్ సింగ్ , హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
Also Read: అసోంలో ఏనుగుల మందను ఢీకొన్ని రాజధాని ఎక్స్ ప్రెస్
🚨India’s squad for ICC Men’s T20 World Cup 2026 announced 🚨
Let’s cheer for the defending champions 💪#TeamIndia | #MenInBlue | #T20WorldCup pic.twitter.com/7CpjGh60vk
— BCCI (@BCCI) December 20, 2025
[…] Also Read: T-20 World Cup-2026 టీమిండియా జట్టు ప్రకటన […]
[…] Also Read: T-20 World Cup-2026 టీమిండియా జట్టు ప్రకటన […]