ఈ నెల 22 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు

హైదరాబాద్ (CLiC2NEWS): ఈ నెల (నవంబరు) 22 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు వరకు ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ వెల్లడించారు. 15వ తేదీ నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను కానీ… 040 –224455 66 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.