తెలంగాణ మంత్రులకు కేటాయించిన శాఖలు..
భట్టికి ఆర్థిక, శ్రీధర్‌బాబుకు ఐటి..
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా నియమించిన మంత్రులకు శాఖలు కేటాయించారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సిఎం.. పార్టీ అధినేలతలో సమావేశమైనట్లు సమాచారం. మంత్రివర్గ శాఖలు గురించి వారితో చర్చించిన అనంతరం ప్రకటన చేశారు.
మంత్రులు.. వారికి కేటాయించిన శాఖలు
భట్టి వక్రమార్క – డిప్యూటి సిఎం, ఆర్ధిక, ఇంధన శాఖ
.జూపల్లి కృష్ణారావు- ఎక్సైజ్, పర్యాటకం
తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయం, చేనేత
ఉత్తమ్ కుమార్ రెడ్డి- నీటిపారుదల,పౌరసరఫరాలు
దామోదర రాజనర్సింమ -వైద్యారోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజి
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి – ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫి
దుద్దిళ్లు శ్రీధర్ బాబు- ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ
పొన్నం ప్రబాకర్ – రవాణా, బిసి సంక్షేమం
సీతక్క – పంచాయితీ రాజ్, మహిళ, శిశు సంక్షేమం
కొండా సురేఖ – అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ