ప్రజలతో డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ ముఖాముఖి.. వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం..

టెక్కలి (CLiC2NEWS): అంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుండి శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్థులతో మాట్లాడారు. ఈ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో వేర్వేరు ప్రాంతాల నుండి మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
మన ఊరు-మాటా మంతి పేరుతో డిప్యూటి సిఎం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రావివలస గ్రామ ప్రజలతో టెక్కలిలోని భవాని థియేటర్‌లో ముఖాముఖి నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు వాటి పరిష్కారానికి సంబంధించి అధికారులకు పవన్ అదేశాలు జారీ చేశారు. టెక్కలి గ్రామంలోని ఎండల మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్దికి , పంజాయతిలో తాగునీటి సమస్య పరిష్కారానికి , రహదారులు.. కాలువల వ్యవస్థ.. పెద్ద చెరువు అభివృద్ధికి, ధోబి ఘాట్ , ఇతర నిర్మాణాలకు రూ.15 కోట్లు మంజూరు చేస్తూ డిప్యూటి సిఎం నిర్ణయం తీసుకున్నారు.