రూ.80వేల కోట్లు ఏంచేశారు?.. కెటిఆర్
లెక్కలు చూపిన డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్ (CLiC2NEWS): రూ.80 వేల కోట్లకు పైగా అప్పులు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టైనా కట్టిందా అని బిఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ప్రశ్నించగా.. దానికి బదులుగా రాష్ట్ర డిప్యూటి సిఎం స్పందించారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రూ. 49 వేలక కోట్లకు పైగా రణాలు తీసుకోవడంతోపాటు, రూ. 56 వేల కోట్లకు పైగా పాత అప్పులు , వడ్డీలు చెల్లించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, వ్యయంపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 2023 డిసెంబర్ నుండి 2024 అక్టోబర్15 వరకు వివరాలు వెల్లడించింది.
అక్టోబర్ 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలు మొత్తం రూ. 49,618 కోట్లు, ఇదే సమయంలో పాత అప్పులు, వడ్డాల కోసం రూ. 56,440 కోట్లు చెల్లించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మూలధన వ్యయం రూ. 21,881 కోట్లని.. రుణమాఫి, రైతు భరోసా, చేయూత, విద్యుత్, బియ్యం, గ్యాస్ , రాయతీలు, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, స్కాలర్ షిప్‌లు, ఆర్‌టిసి, కల్యాణలక్ష్మి పథకాల కోసం రూ. 54,346 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్లు తెలిపారు.