రైతుభరోసా అమలుకు ప్రజాభిప్రాయ సేకరణ.. భట్టి విక్రమార్క
ఖమ్మం (CLiC2NEWS): రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుభరోసా అందజేస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం కలక్టరేట్లో నిర్వహించిన రైతు భరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్తాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. త్వరలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. రైతుభరోసా పథకం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, రైతుల నండి అభిప్రాయాలు సేకరించి విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి , తుమ్మల నాగేశ్వరరావు తదితర అధికారలు పాల్గొన్నారు.