కొండలు, గుట్టలకు రైతుబంధు బంద్..!

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో రైతుబంధు.. కొండలు, గుట్టలు, రోడ్లకు రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని.. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే ఇస్తున్నట్లు డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం యాన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళను మహాలక్ష్మిగాగే భావించి గౌరవిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. మార్చి 12వ తేదీన మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. దీంతో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు పెట్టకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.