బౌద్ధ మహాస్థూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాం. డిప్యూటి సిఎం భట్టి
నేలకొండపల్లి (CLiC2NEWS): అంతర్జాతీయ స్థాయి పర్యటకులను నేలకొండపల్లి ఆకర్షిస్తోందని.. బౌద్ధ మహాస్థూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి, ఎంపి రహురామిరెడ్డితో కలిసి నేల కొండపల్లిలోని భక్త రామదాసు ధ్యానమందిరం, బౌద్ధ మహాస్థూపాలను సందర్శించారు. స్థానిక బౌద్ధ మహాస్థూపం విశేషాలను పురావస్తు శాఖ, పర్యటక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్రీస్తు శకం రెండో శతాబ్ధం నాటి ఈ స్థూపాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వెంటనే రోడ్ మ్యాప్ తయారు చేసి డిపిఆర్‌ను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.