రాష్ట్రాభివృద్ది కోసం సిఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్న నూరుశాతం సహకరిస్తాం: జనసేనాని
అమరావతి (CLiC2NEWS): ఎల్లకాలం అధికంలోనే కొనసాగుతామనే భ్రమ నుండి జగన్ ఇంకా బయటపడలేదని.. ప్రజలు ఆ భ్రమ నుండి బయట పడేసినా ఇంకా తనే సిఎం అనుకుంటున్నారేమోనని పవన్‌కల్యాణ్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఆయనకు ఇంకా తత్వం బోధపడినట్లు లేదన్నారు. కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి కోసం సిఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా .. తాను, జనసేన పార్టి నూటికి నూరు శాతం సహకరిస్తుందని అన్నారు.
గ్రూపు తగాదాలకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెప్తూ కుట్రలకు జగన్ తెరలేపుతున్నారని.. అసెంబ్లీలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం అతని అహంకార ధోరణికి నిదర్శనమన్నారు.