పిఠాపురం: టీచర్లకు డిసిఎం పవన్ కల్యాణ్ గిప్ట్స్
పిఠాపురం (CLiC2NEWS): పిఠాపురం నియోజకవర్గంలోని టీచర్లకు డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ ఉపాధ్యాయ దినోత్సవపు కానుకలందించారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు టీచర్స్ డే సందర్భంగా ఒక రోజు ముందే గిప్ట్స్ అందించారు. మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంటు-షర్టు చొప్పున మొత్తం 2వే మందికి అందించారు. పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల విద్యాశాఖ కార్యాలయాల్లో ప్రత్యేక టీమ్ ద్వారా గురువారం ఉదయాన్నే పంపిణీ చేశారు. డిసిఎం పంపించిన కానుకలపై ఉపాధ్యాయులు , అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: శేషం శ్రీనివాసా చార్య: గురువులకు విన్నపం!
[…] […]