AP: రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితీల్లో డ‌బ్బులు లేవు: డిప్యూటి సిఎం

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటి సిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ శుక్ర‌వారం తొలిసారి తాడేప‌ల్లిలోని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ క‌మిష‌న‌ర్‌ కార్యాల‌యానికి వ‌చ్చారు. ఆయ‌న‌కు అధికారుల‌కు స్వాగ‌తం ప‌లికారు. సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్‌మెంట్ (ఎస్ఎల్ఆర్ఎమ్) పై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిష‌న్‌ను ఆయ‌న తిల‌కించిన‌ అనంత‌రం ప‌వ‌న్ మాట్లాడుతూ.. ఎస్ఎల్ఆర్ఎమ్ ను ముందుకు తీసుకెళ్లాల‌ని .. అది ముందుగా పిఠాపురం నుండే ప్రారంభిస్తామ‌న్నారు.
గ‌త ప్ర‌భుత్వం వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసిందని రాష్ట్రంలో ఎక్క‌డా డ‌బ్బులు లేవ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు. ప్లాస్టిక్ వ‌ల్ల జ‌లం క‌లుషిత‌మ‌వుతుంద‌ని.. ప్లాస్టిక్ వ్య‌ర్ధాలు తినడం వ‌ల‌న జీవ‌రాశులు మ‌ర‌ణిస్తున్నాయన్నారు. చెత్త‌ను రీసైక్లింగ్ చేసి పంచాయ‌తీలు ఆదాయం పొందేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. వేస్ట్ మేనేజ్‌మంట్‌, ప‌రిశుభ్ర‌త ప్ర‌జ‌లు బాధ్య‌త‌గా తీసుకోవాల‌ని తెలిపారు. చెత్త‌తో ఏటా రూ. 2,643 కోట్లు ఆదాయం తీసుకు రావ‌చ్చు. రాష్ట్రంలో 2.5 ల‌క్ష‌ల మందికి ఉపాధి క‌ల్పించే వీలువుతుంద‌ని తెలిపారు. ఒక్క రోజులో పంచాయితీల దుస్థితిని మార్చాలేమ‌ని, మార్పుకోసం కొంత స‌మ‌యం పడుతుంద‌ని డిప్యూటి సిఎం అన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.