Kakinada: పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్

కాకినాడ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టిఆర్ భరోసా పేరిట పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్బంగా కాకినాడ జిల్లా గొల్లప్రోలులో లో ఏర్పాటు చేసిన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో డిప్యూటి సిఎం జనసేనాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నానని.. తక్కువ చెప్పి ఎక్కువ పనిచేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
పలు ప్రాంతాల్లో మంచినీటి సమస్య అధికంగా ఉందని.. గోదావరి జలాలు పారుతున్న ప్రాంతాల్లో సైతం మంచినీటి సమస్యలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో పంచాయితీ నిధులు ఎటు వెళ్లాయో తెలియటంలేదన్నారు. రుషి కొండలో ప్యాలెస్‌లు బదులు అభివృద్ది పనులు చేస్తే బావుండేదన్నారు. జల్‌జీవన్ మిషన్ నిధులున్న ఉపయోగించలేదని.. కనీసం మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదన్నారు. నేను అద్భుతాలు చేస్తానని చెప్పడం లేదు.. నా దేశం.. నేల కోసం పనిచేస్తానని పవన్‌కల్యాణ్ అన్నారు. అన్ని పనులు చిటికెలో కావు.. కానీ అయ్యే వరకు పనిచేస్తామన్నారు. అనంతరం పలువురు లభ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.