మరో పదేళ్లపాటు చంద్రబాబే సిఎంగా ఉండాలి: డిసిఎం పవన్ కల్యాణ్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పదేళ్లపాటు చంద్రబాబే సిఎంగా ఉండాలని డిసిఎం పవన్‌కల్యాణ్ అన్నారు. ఎపి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలలో భారతీయులు ఎక్కడున్నా , అందులో సగం మంది తెలుగువారు ఉండటానికి కారణం చంద్రబాబేన్నారు. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, చివరకు జైల్లో ఎట్టినా.. ఎలాంటి సమస్యలను అయినా అధిగమించగలం అనేటటువంటి నమ్మకం.. ఈ 150 రోజుల ముఖ్యమంత్రి గారి పాలనానుభవంతో సంపూర్ణమైన విశ్వాసం ఉందన్నారు. గత ప్రభుత్వం ఎకానమీని నిర్వీర్యం చేసిందని, అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్లిపోయిందన్నారు. ముఖ్యమంత్రిగారి అనుభవం, పారదర్శకత, విజనరీ.. అన్నీకూడా త్వరలో వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమి వైపు దూసుకెళ్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.