చంద్ర‌యాన్ 4,5 ల‌కు సంబంధించిన డిజైన్‌లు పూర్తి: ఇస్రో ఛైర్మ‌న్‌

ఢిల్లీ (CLiC2NEWS): రానున్న ఐదేళ్లో భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ఇస్రో).. దాదాపు 70 ఉపగ్ర‌హ ప్ర‌యోగాలు చేప‌ట్ట‌నుంద‌ని ఛైర్మ‌న్ సోమ‌నాథ్ వెల్ల‌డించారు. చంద్రుడిపై అన్వేష‌ణ‌లో ఇప్ప‌టికే చంద్ర‌యాన్ 3 పూర్త‌వ్వ‌గా.. అక్క‌డినుండి రాళ్లు, మ‌ట్టి తీసుకువ‌చ్చే ల‌క్ష్యంతో మ‌రిన్ని ప్ర‌యోగాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. దీనిలో భాగంగా చంద్రాయాన్ 4,5 డిజైన్లు పూర్త‌యిన‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఇవి ప్ర‌భుత్వ ఆమోదం పొందే ప్రక్రియ‌లో ఉన్నాయని తెలిపారు. మాన‌వ ర‌హిత గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్టు ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో చేప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు సోమ‌నాథ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అన్ని విభాగాల రాకెట్లు శ్రీ‌హ‌రి కోట‌కు ఇప్ప‌టికే చేరుకున్న‌ట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.