Devara Glimpse: ఎన్టీఆర్ అభిమానులకు పండగే!

హైదరాబాద్ (CLiC2NEWS): ఎన్టీఆర్ అభిమనులకు సంక్రాంతి ముందుగానే వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం `దేవర`. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ చిత్ర బృందం గ్లింప్స్ ను విడుదల చేసింది. ఎన్టీఆర్ సరికొత్త లుక్తో అభిమానులకు దర్శనమిచ్చారు. రెండు బాగాలుగా రానున్న `దేవర` మొదటి పార్ట్ ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షల ముందుకు రానుంది.