రేపు మహారాష్ట్ర సిఎంగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణం
ముంబయి (CLiC2NEWS): దేవేంద్ర ఫడణవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర సిఎంగా బిజెపి సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ పేరు ఖరారైంది. గురువారం ఆజాద్ మైదానంలో ప్రమాణస్వీకారం జరగనుంది. బిజెపి కోర్ కమిటి సమావేశంలో ఫడణవీస్ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సమాచారం. కోర్ కమిటి సమావేశానికి నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ హాజరయ్యారు. సిఎం ఎంపికపై పార్టి ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం బిజెపి శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడణవీస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసనసభలో మహాయుతి కూటమికి కూడా ఆయనే నేతృత్వం వహించేందుకు పార్టీల మధ్య అంగీకారం కుదురినట్లు సమాచారం.
దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ సహా ఎన్‌డియే కీలక నేతలు హాజరుకానున్నారు. సిఎంతో పాటు శివసేన నేత ఎక్‌నాథ్ శిండే ఎన్‌సిపినేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.