శబరిమల దర్శనం.. కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం!
తిరువనంతపురం (CLiC2NEWS): శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం రోజుకు గరిష్టంగా 80వేల మందికే అనుమతించనున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్వామి దర్శనం కోసం ఆన్లైన్ బుకింగ్ ద్వారానే యాత్రికులకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. మరో నెల రోజుల్లో మకరవిళక్కు సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది. వర్చువల్ బుకింగ్ సమయంలో యాత్రికులు తమ ప్రయాణ మార్గాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉందని సిఎంఒ ప్రకటనలో తెలిపింది. అటవీ మార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.