కిక్కిరిసిన ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు

హైదరాబాద్ (CLiC2NEWS): వరుస సెలవులు కావడంతో ఖైరతాబాద్ మహాగణేశుని దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. నిన్నటి కంటే ఆదివారం భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో విపరీతమైన భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం భక్తుల దర్శనాలకు అనుమతులు నిలిపి వేసి నిమజ్జనానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేయనున్నారు.