ఆలయాలకు పోటెత్తిన భక్తజనం
హైదరాబాద్ (CLiC2NEWS): కొత్త సంవత్సరం సందర్భంగా తెలగు రాష్ట్రాలలోని ప్రముఖ దేవాలయాలకు భక్తజనం పోటెత్తారు. కొత్త ఆంగ్ల సంవత్సరానికి తోడు ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. తెలంగాణలోని యాదాద్రి, వేముల వాడ, పెద్దమ్మ గుడి, చిలుకూరు బాలాజిఆలయలతో పాటు, ఎపిలో విజయవాడ కనకదుర్గ, తిరులపతి శ్రీశైలం తదితర ఆలయలో భక్తులు మొక్కలు తీర్చుకున్నారు.