మేడారానికి పోటెత్తిన భక్తులు
మేడారం (CLiC2NEWS): దేశంలోనే అతిపెద్ద జాతరగా మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతరకు భక్తజనం పోటెత్తుతున్నారు. ఇంకా ఈ మహాజాతరకు నెలరోజుల సమయం ఉండగానే మేడారంలో భక్తులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
సంక్రాంతి సెలవులు కావడం.. అలాగే కొవిడ్ ఉదృతి దష్ట్యా చాలా మంది భక్తులు ముందుగా అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. భారీ సంఖ్యలో చేరుకుంటున్న భక్తులతో మేడారం జనసంద్రంగా తయారైంది. భక్తులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండి పసుపు-కుంకుమలతో వనదేవతలకు పూజలు చేసి బంగారన్ని సమర్పిస్తున్నారు. మొక్కులు చెల్లించేందుకు భారీగా వస్తున్న భక్తులతో మేడారం పరిసరాలు రద్దీగా మారాయి. కొవిడ్ ఉధృతి నేపథ్యంలో అధికారులు ముందుస్తు చర్యలు చేపడుతున్నారు. భక్తులు నిబంధనలు పాటించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
జాతర జరిగే తేదీలు
- ఫ్రిబరి – 16 – సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెల వద్దకు చేరుస్తారు.
- ఫిబ్రవరి -17 – చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెవద్దకు తీసుకువస్తారు.
- ఫిబ్రవరి -18 సమ్మక్క-సారక్క అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకోవడం.
- ఫిబ్రవరి -19- మనప్రవేశం. జాతర ముగింపు