మే 5 నుండి శ్రీవారి మెట్టుమార్గంలో భక్తులకు అనుమతి..
టిటిడి పలు కీలక నిర్ణయాలు
తిరుమల (CLiC2NEWS): తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి శనివారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల అన్నమయ్య భవన్‌లో ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అనంతరం పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
నడక దారిలో తిరుమలకు వెళ్లే భక్తులకు త్వరలో టోకెన్ల జారీ చేయనుంది. టైం స్లాట్ దర్శనాలు, టోకెన్లు కొనసాగించాలని నిర్ణయించింది. శ్రీవారి మెట్టు మార్గంలో మే 5వ తేదీనుండి అనుమతి, తిరుమల బాలాజి నగర్ వద్ద ఎలక్ట్రిక్ బస్ స్టేషన్ ఏర్పటు, టిటిడి ఉద్యోగుల వసతి గృహాల ఆధునీకరణ, వస్తురూపంలో విరాళాలు ఇచ్చే దాతలకూ ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.