ధనురాసనం

శరీరాన్ని ధనుస్సులాగా వంచుతాం గనుక దీనికి ధనురాసనం అని పేరు వచ్చింది. ధనుస్సును ఎక్కుపెట్టి లక్ష్యాన్ని చెందించినట్లు సాధకుడు సాధ్యమైనంత ఎక్కువ శక్తిని సమాకుర్చుకొని చురుకుగా తయారు అవుతాడు.

  • ఈ ఆసనం వలన మన శరీరంలోని అతి ముఖ్యభాగలైన కడుపు వీపు, పైన అత్యధిక ప్రభావం పడుతుంది.
  • ముడుకులు పైకి లేపటం వలన పొత్తికడుపులోని కండరాలు ఎక్కువ శక్తిని పుంజుకుంటాయి. విశేషించి స్త్రీల గర్బాశయ, ఋతుశ్రావలకు సంబందించిన సమస్యలన్నీ దూరం అవుతాయి.
  • మీరు దండం మీద బలం పడటం వలన అది ఎటు పడితే అటు వంగుతుంది. వెన్ను కింది భాగంలో కరుకుతనం తగ్గుతుంది.
  • మెడ, భుజాలు, బహువులు, ఊపిరితిత్తులు, ప్రక్కటేముకలు, తొడలు, ముడుకులు, కాళ్ళలోని కండరాలు, నరాలు, నాడులు, బలంగా తయారు అవుతాయి.
  • దీని వలన నడుము సన్నబడుతుంది. నాభి సరైన స్థానంలో ఉండి, లావు తగ్గుతుంది.
  • జీర్ణశక్తి బాగుపడుతుంది. విరోచనాలు, పేగులలో నీరసం, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు, దూరం అవుతాయి
  • రక్తపోటు సమస్యలు తోలుగుతాయి. నాడి మండలంలోను ఆరోగ్యాన్ని, బలాన్ని పుంజుకుంటాయి.
  • గ్రందులన్నీటితో బాటు నాడిమండలంలోను చురుకుతనం వస్తుంది.

చేయు విధానం 

ఆసనం మీద బోర్ల పడుకోవాలి, రెండు కాళ్ళను మడవాలి, చేతులతో చీలమండలను పట్టుకోవాలి. ఐదు వేళ్ళు ఒకే దిశలో ఉండాలి. మోకాళ్ళను సాధ్యమైనంత దగ్గరగా ఉంచాలి. తలను భూమికి అనించాలి. శ్వాసను విడిచి మోకాళ్ళను సాధ్యమైనంత పైకి ఎత్తాలి. ఆపైన శ్వాసను పీల్చుతూ మేడను ఎత్తుతు శరీరాన్ని కూడా సాధ్యమైనంత పైకి ఎత్తాలి. శ్వాసను సామాన్యంగా ఉంచాలి. కొంచెం సేపు ఈ స్థితిలోనే ఉండాలి. మెల్లగా యాదస్థితికి వచ్చి సిద్ధిలాశంలో విశ్రాంతి తీసుకోవాలి.

ధ్యానకేంద్రం.. స్వాధిష్టాన చక్రం.

అన్నిటికన్న ముందు మోకాళ్ళను సాధ్యమైనంత పైకి ఎత్తి ఆపైన మెడను శరీరాన్ని ఎత్తాలి.
చేతులను, కాళ్ళను, విపరీత దిశలో ఎంత హెచ్చు సాగదిస్తే అంత హెచ్చుగా కండరాలు, నరాలు, గ్రంధులు ప్రభావితం అవుతాయి.

-షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు,

Leave A Reply

Your email address will not be published.