Dharani: భూసమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో భూసమస్యల పరిష్కారానికి 5 రోజులపాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ రోజుకు 20% చొప్పున పెండింగ్ కేసులన్నీ పరిష్కరించాలని ఆదేశించారు.
పార్ట్ బీ నుంచి పార్ట్ ఏలో చేరిన భూములకు రైతుబంధు సాయం అందించేందుకు కటాఫ్ తేదీని పదిగా నిర్ణయించారు. దీంతో పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వాటి పరిష్కారం కోసం ఈ 5 రోజుల పాటు ప్ర్తయేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.