ధరణి సమస్యల పరిష్కారానికి కసరత్తు!

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్స్‌కు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఈ మధ్య భేటీఅయి పలు సమస్యలపై చర్చించింది. ఈ ఇప్పటికే రైతుసంఘాలు, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ట్రెసా), క్రెడాయ్ తదితర వర్గాల ప్రతినిధులు ఇప్పటికే ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు..
మొత్తం 34 రకాల సమస్యలను అధికారులు సబ్‌కమిటీ దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ఇప్పటికే దాదాపు 22 రకాల సమస్యలకు ధరణిలో మాడ్యూల్స్ ఉన్నట్టు గుర్తించారు. ఒక క్యాటగిరీకి ధరణితో సం బంధం లేదని.. మిగతా 11 ఇబ్బందులకు పరిష్కారం చూపాల్సి ఉంటుందని గుర్తించినట్టు సమాచారం. ఈ క్రమంలో మరోసారి వచ్చేవారం ఈ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
అధికారులు గుర్తించిన సమస్యలు
- పేరులో మార్పులు, చేర్పులు.
- విస్తీర్ణంలో మార్పులు.
- సర్వే నంబర్ తొలిగింపు.
- ఎన్‌వోసీ / ఓఆర్సీ / 38-ఈ / 13 – బీ
- సర్వే నంబర్‌ను భిన్నమైన ఖాతాలకు మళ్లించడం.
- అసైన్డ్ భూములను పట్టా భూములగా మార్పు.
- ల్యాండ్ నేచర్ / ల్యాండ్ టైప్‌ను మార్చడం.
- మిస్సింగ్ సర్వేనంబర్ / కొత్త ఖాతా సృష్టించడం.
- ఖాతాల విలీనం / ఖాతాను విభజించడం.
- లావాదేవీని నిలిపివేయడం / ఉపసంహరించడం.
- జాయింట్ పట్టా..